Thursday, October 11, 2007

కార్గిల్ యుద్ధం

బూడిదలో పోసిన పన్నీరు
మరోసారి పాకిస్తాన్ దురాక్రమణకొచ్చింది,
మరోసారి భారత్ తన పరాక్రమం చూపింది!
ఇదేమీ మనకు క్రొత్త కాదు;
గత యాభై రెండేళ్ల నుండి జరుగుతున్న ప్రహసనం ఇది!
భరతమాత కిరీటమగు కాశ్మీరును కబళించే యత్నంలో
గుంటనక్క పాకిస్తాన్ కుటిల కుతంత్రాలకు దిగి లిఖిస్తున్న చరిత్ర ఇది!
ప్రతిసారీ దురాక్రమణను వీరోచితంగా తిప్పికొట్టి
అమరులైన మన వీర సైనికుల త్యాగాలను తుంగలో తొక్కి
మన దేశ నాయకులు 'చేజేతులారా' లిఖిస్తున్న చరిత్ర ఇది!
ఇకనైనా ఆపాలి శాంతికపోతాల నాటకం,
నయవంచనకు మారుపేరైన పాకిస్తాన్ 'కాలకూట విషకీటకం'!
అలాంటి దేశంతో శాంతి ఒప్పందం అన్నది పచ్చిబూటకం!
ఇదే మనకు ఇన్నాళ్ల చరిత్ర నేర్పుతున్న పాఠం;
ఎన్నాళ్లిక అనవసరపు సంయమనం, అసంబద్ధ ఓర్పు - సహనం?
ఇక తొలగించాలి ప్రపంచం నుంచి పాకిస్తాన్ పటం,
నిర్మించాలి అమర అఖండ భారతం!!
ఈ పని చేయకపోతే మన అమరవీరుల త్యాగాలకు ఫలముండదు,
వారి కుటుంబీకుల కన్నీళ్లకు విలువుండదు;
అవుతుంది అంతా "బూడిదలో పోసిన పన్నీరు"!!
1999లో కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో నేను దీన్ని వ్రాశాను.

No comments: